Site icon HashtagU Telugu

DalitBandhu: దళితబంధు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం

దళితబంధు పథకం అమలులో భాగంగా నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది.

నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. విడుదలైన నిధుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో దళిత బంధును అమలు చేసేందుకు 50కోట్ల రూపాయలు,
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో వంద కోట్లు, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలంలో 50 కోట్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని నిజాం సాగర్ మండలంలో 50 కోట్ల రూపాయలన. జమ చేసినట్లు కార్పొరేషన్ తెలిపింది.

దళితబంధు పధకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ పధకాన్ని అమలుచేస్తామని కేసీఆర్ తెలిపారు.