Ayodhya: అయోధ్యలో భక్తుల సౌకర్యార్థం ఉన్నత స్థాయి క‌మిటీ ఏర్పాటు.. ప్యానెల్ బాధ్య‌త‌లు ఇవే..!

అయోధ్య (Ayodhya)లో రామమందిరాన్ని ప్రారంభించినప్పటి నుండి రాంలాలాను చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో భ‌క్తుల‌ను అదుపు చేయ‌డం పరిపాలనకు కష్టంగా మారింది.

Published By: HashtagU Telugu Desk
Ram Temple

Ayodhya Ram Mandir

Ayodhya: అయోధ్య (Ayodhya)లో రామమందిరాన్ని ప్రారంభించినప్పటి నుండి రాంలాలాను చూడటానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో భ‌క్తుల‌ను అదుపు చేయ‌డం పరిపాలనకు కష్టంగా మారింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు అయోధ్యకు వచ్చే భక్తులకు శ్రీరాముని సక్రమంగా దర్శనం కల్పించడంతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు.

రామజన్మభూమి కాంప్లెక్స్‌లో అన్ని ఏర్పాట్లను సీఎం యోగి ఏర్పాటు చేసిన కమిటీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ ఉన్నారు. ఇందులో ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), ముఖ్యమంత్రి అదనపు ముఖ్య కార్యదర్శితో పాటు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు.

సీఎం యోగి కమిటీని ఏర్పాటు చేశారు

అధికారిక ప్రకటన ప్రకారం.. రామజన్మభూమిలో భగవాన్ శ్రీ రామ్‌లాలా పవిత్రాభిషేకం తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తున్నారు. మూడో రోజు కూడా జన్మభూమి మార్గంలో సందర్శకుల భారీ క్యూ కనిపించిందని, అయితే మొదటి రోజులాగా గురువారం ఎటువంటి గందరగోళం లేదని ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ పర్యవేక్షణలో పాలనా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం నిరంతరంగా వ్యవస్థను మెరుగుపరిచే పనిలో నిమగ్నమై ఉన్నాయన్నారు.

Also Read: Ram Lalla’s Idol: ఎవ‌రీ ముఖేష్ ప‌టేల్‌..? బాల రాముడికి రూ. 11 కోట్ల కిరీటాన్ని ఎందుకు ఇచ్చాడు..?

ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసిన తరువాత శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. మొదటి రెండు రోజుల్లోనే సుమారు ఎనిమిది లక్షల మంది రామభక్తులు తమ దేవుడిని దర్శించుకున్నారు. ఈ రోజుల్లో అయోధ్య నగరం భక్తుల క్యూలతో నిండిపోయింది. రామాలయ ప్రారంభోత్సవం నాలుగో రోజు కూడా రాంలాల దర్శనం కోసం పొడవైన క్యూలు కనిపిస్తున్నాయి. చలిని పట్టించుకోకుండా తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకున్న భక్తులు తమ వంతు కోసం వేచి చూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 26 Jan 2024, 09:37 AM IST