Tomato: ప్రభుత్వం కీలక నిర్ణయం.. కిలో టమాటా 80 రూపాయల చొప్పున అందుబాటులోకి..!

టమాటా (Tomato) అధిక ధరలను తగ్గించే ప్రయత్నంలో, తక్కువ ధరకు టమోటాలు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సహకార సంఘాలను ఆదేశించింది.

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 08:32 AM IST

Tomato: టమాటా (Tomato) అధిక ధరలను తగ్గించే ప్రయత్నంలో, తక్కువ ధరకు టమోటాలు విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సహకార సంఘాలను ఆదేశించింది. ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ వంటి సహకార సంఘాలలో గతంలో కిలో రూ.90కి విక్రయించే టమాటా ఇప్పుడు రూ.10 తగ్గించి, ఆ తర్వాత కిలో రూ.80కి విక్రయిస్తున్నారు.

ఏ రాష్ట్రాల్లో టమోటాలు చౌకగా లభిస్తాయి

ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, పాట్నాలలో టమాటా చౌక ధరలకు అమ్ముడవుతుండడంతో పేదలకు పెరిగిన ధరల నుంచి కొంత ఊరట లభించింది. టమాటా ధరలు ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి టమాటా హోల్‌సేల్ ధరలను తగ్గించేందుకు చర్యలు చేపట్టిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టమోటా ధరలను తగ్గించేందుకు ప్రయత్నించిన ప్రభావం ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్‌లలో కనిపిస్తోంది. ఇప్పుడు టమాటాలు ఇక్కడ కిలో రూ.80 చొప్పున లభిస్తున్నాయి.

Also Read: Uniform Civil Code: యూనిఫాం సివిల్ కోడ్‌పై తమిళిసై కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వం ఏమి చెబుతుంది

వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మాత్రమే ఖరీదైన టమాటాల నుండి ప్రజలకు ఉపశమనం లభించిందని, ఆ తర్వాత టమోటా ధరలు రూ. 35-40 వరకు తగ్గాయి. జూలై 15 వరకు కిలో రూ. 90. అయితే మరుసటి రోజు అంటే జూలై 16న ఈ ధరలు కిలోకు రూ. 80కి తగ్గించబడ్డాయి. ఇంతకు ముందు కిలోకు రూ. 130-150 ఉన్న ధర ముందు ఈ ధరలు రిలీఫ్ ఇచ్చాయి. కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా టొమాటో ధరలు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాయి. రాబోయే కాలంలో అవి మరింత తగ్గుతాయి.” అని ఆయన అన్నారు.

పెరుగుతున్న టమాటా ధరలు కలకలం రేపుతున్నాయి

దేశంలో పెరుగుతున్న టమోటా ధరలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కొన్ని చోట్ల వంటగదిలో ఉపయోగించే ఈ ముఖ్యమైన వస్తువు ధర కిలోకు 160-180 రూపాయలకు చేరుకుంది. అయితే, దీని కారణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్ణయించి ప్రభుత్వ సహకార సంఘాలైన ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్‌లకు తక్కువ ధరకు టమోటాలు అందించేందుకు ప్రయత్నాలు చేసింది. దీంతో ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి టమాటా కొనుగోళ్లు పెంచాలని నిర్ణయం తీసుకుని కొత్తగా వచ్చిన టమాటాలను ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు.