అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా RSS తలపెట్టిన ర్యాలీకు ఎందుకు అనుమతివ్వరని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ ప్రశ్నించారు. చెన్నైలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్బంగా RSS ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తోందని…ఆ సంస్థ నిర్వహించే ర్యాలీలు ప్రశాంతంగా జరుగుతాయి. గతంలో నేను కూడా RSSలో సేవలందించానంటూ చెప్పుకొచ్చారు. ఈ ర్యాలీని నిషేధించాల్సిన అవసరం లేదన్నారు. ర్యాలీకి అనుమతివ్వడమే సమంజసంగా ఉంటుందని ప్రభుత్వానికి సూచించారు.
గాంధీ జయంతి రోజు ర్యాలీ ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. తమిళనాట బాంబు సంస్కృతికి ఎన్నడూ తావులేదన్నారు. ఏ రాష్ట్రంలోనూ బాంబుల సంస్కృతి ప్రోత్సహించకూడదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అన్ని మతాలవారికి భద్రత కల్పించి నిష్పక్షపాతంగా వ్యవహిరించాలని తమిళిసై సూచించారు.