దేవుడు కనికరించినా పూజారి వరం ఇవ్వడు.. అన్న మాదిరిగా టీఎస్ఆర్టీసీ విలీనం (TSRTC Bill) బిల్లు విషయంలో ఏర్పడింది. ఆర్టీసీ విలీనానికి సీఎం కేసీఆర్ (CM KCR) ఆమోదం తెలిపినప్పటికీ..గవర్నర్ తమిళసై (Governor Tamilisai Soundar Rajan) మాత్రం అడ్డుపడింది. ఇక ఎట్టకేలకు నెల తర్వాత అమ్మ మనసు కరిగింది..ఆర్టీసీ విలీనం బిల్లుకు ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తెలుపడం తో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందినట్లు గవర్నర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన బిల్లును ఆగస్టు 06 న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఆ తర్వాత దీన్ని గవర్నర్‌కు పంపించారు. దీనిపై ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న గవర్నర్ ఈరోజు ఆమోదించినట్టు అధికారిక ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ రూల్స్ ప్రకారం కొనసాగనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పీఆర్సీనే ఆర్టీసీ ఉద్యోగులకు వర్తిస్తుంది. కార్మికుల బకాయిలను కూడా చెల్లిస్తామని, ఆర్టీసీ కార్పొరేషన్, దాని ఆస్తులు అదే విధంగా ఉంటాయంది. ఆర్టీసీ ఉద్యోగులతో చర్చించి పదవి విరమణ ప్రయోజనాలు నిర్ణయిస్తామంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై ప్రతి ఏడాది రూ.3000 కోట్లు అదనపు బారం పడనుంది.
Read Also : Ananya Pandey : బ్రౌన్ లైట్ లో మెరిసిపోతున్న లైగర్ భామ
కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. జీతాలు లేక వారి కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడినా ఉద్యమానికి ఊపిరు లూదారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి వేతనాలు పెంచారు. ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. ఆర్టీసీ మనుగడకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి భరోసా కల్పించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను చేసారు సీఎం కేసీఆర్.