Site icon HashtagU Telugu

Disaster Prevention: ముంపులేని హైద్రాబాద్ కు ‘ముందస్తు’ ప్రణాళిక

Ghmc

Ghmc

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లో రానున్న వర్షాకాలంలో జరిగే విపత్తుల నివారణ చర్యలపై ముందస్తు ప్రణాళికను మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ లో అకాల భారీ వర్షాల వలన వరదలు, లోతట్టు  ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులన్నింటినీ వర్షాకాలానికి ముందుగా పూర్తి చేేయాలని ఆదేశించారు.  SNDP ద్వారా ప్రాధాన్యత పనులను గుర్తించి యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు రూ. 858 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన 60 పనులలో జిహెచ్ఎంసి పరిధిలోని 37 పనులలో 90 శాతం పనులు ప్రారంభించడం జరిగిందన్నారు.

మిగిలిన పనులు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి వెంటనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాలాల ద్వారా వరద ప్రవాహం నివారించేందుకు చుట్టుపక్కలనున్న మునిసిపాలిటీలలో కూడా పనులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
SNDP ప్రణాళికలో లేని నాలా పనులు మిస్సయిన పక్షంలో అలాంటి పనులను కూడా గుర్తించి వరద నివారణకు పనులను పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటి కప్పుడు పనులను పర్యవేక్షణ చేసి వేగవంతంగా పూర్తి అయ్యేందుకు కృషి చేయాలన్నారు
నగరంలో చెరువులు, కుంటల ద్వారా కూడా వరద ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.  నగరంలో గల చెరువులను పరిశీలించి బలహీనంగా ఉన్న ఆనకట్ట, స్లూస్ లను గుర్తించి అట్టి చేర్వులలో మరమ్మతులు వర్షాకాలం లోపే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు
వర్షాకాలం వరకు ఏవైన  చెర్వులు, కుంటలలో అధిక నీరు ఉన్న పక్షంలో.. ఆ నీటిని క్రింది ప్రాంతానికి తరలించి, వానకాలంలో వచ్చే వరదల వలన ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు.