Site icon HashtagU Telugu

Chhattisgarh: హాస్టల్‌లో మైనర్ గర్భం , రహస్యంగా అబార్షన్

Minor Girl

Minor Girl

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో సమజం తలొంచుకునే ఘటన ఒకటి వెలుగు చూసింది. బాలికల హాస్టల్ లో ఓ మైనర్ విద్యార్థిని గర్భవతి అయింది. ఆపై ప్రభుత్వ పాఠశాలలోని హాస్టల్ అధికారులు మైనర్‌కు అబార్షన్ చేయించారు. అంతే కాదు ఈ వార్తను దాచిపెట్టేందుకు హాస్టల్ నిర్వాహకురాలు మైనర్ బాలికను ఆమె ఇంటికి పంపించి పరీక్షకు కూడా అనుమతించలేదు.

కంకేర్ జిల్లా పఖంజూర్‌కు చెందిన విద్యార్థి రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినుల బాగోగులు చూసేందుకు ఒక మహిళా ఉద్యోగి మాత్రమే హాస్టల్‌లో ఉండేవారు. ఈ సమయంలో ఓ వ్యక్తి మైనర్‌పై అత్యాచారం చేశాడు. దీంతో 16 ఏళ్ల మైనర్ గర్భవతి అయింది. గర్భం దాల్చిన తర్వాత విద్యార్థిని చాలా నెలలు హాస్టల్‌లో ఉంచారు. అయితే విషయం బయటకు రాకుండా ఆమెకు అబార్షన్ చేయించారు.

అందిన సమాచారం ప్రకారం.. మైనర్ విద్యార్థిని గర్భం దాల్చడంతో చాలా కాలం పాటు హాస్టల్ లోనే ఉంటోంది. ఈ సమయంలో వార్డెన్‌కు ఈ విషయం తెలిసింది. వెంటనే విద్యార్థిని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఇంటికి పంపించింది. వార్డెన్ అభ్యర్థన మేరకు కుటుంబ సభ్యులు విద్యార్థికి అబార్షన్ చేయించారు. ఈ విషయమై స్థానికులు జూలై 12న ఎమ్మెల్యే విక్రమ్ ఉసెండికి ఫిర్యాదు చేశారు. అనంతరం దీనిపై చర్యలు తీసుకుని, మొత్తం వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.

అదే సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే శాఖాపరమైన విచారణకు ఆదేశించి హాస్టల్ నిర్వాహకురాలిని సస్పెండ్ చేశారు. విద్యార్థి ఎప్పుడు గర్భవతి అయిందో కూడా సమాచారం ఇవ్వలేకపోవడంతో ఘటనపై కమిటీని ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

Also Read: Crop Loan Waiver : పంటల రుణమాఫీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల