Site icon HashtagU Telugu

పాత‌ క‌రెన్సీ, కాయిన్లకు హై డిమాండ్

ప‌చ్చి అబ‌ద్దాల‌ను న‌మ్ముకుని వ్యాపారం చేసే వాళ్లు ఎక్కువ అయ్యారు. వైర‌ల్ వీడియోలు, మెసేజ్ లు వెబ్ సైట్ల‌లో పెడుతూ పెట్టుబ‌డి లేకుండా వ్యాపారం ఆన్ లైన్ వేదిక‌గా ద్వారా చేస్తున్నారు. ఇలాంటి కోవ‌లోకి రాకుండ ఉండే విధంగా కొంద‌రు వినూత్నంగా బిజినెస్ చేస్తున్నారు. ఆ కోవ‌లోకి వచ్చేలా పాత రూ. 10. రూ. 5 కాయిన్స్ వేలం తెర మీద‌కు వ‌చ్చింది. గ‌త కొన్ని రోజులుగా ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఆ పోస్ట్ లో పొందుప‌ర‌చిన ప్ర‌కారం రూ. 5, రూ. 10 కాయిన్స్ మీ వ‌ద్ద ఉంటే ల‌క్ష‌ల రూపాయ‌ల డ‌బ్బును సంపాదించ‌డానికి వీలుంది. అయితే ఆ కాయిన్స్ మీద వైష్టోదేవి మాత బొమ్మ ఉండాలి. అప్పుడు వేలంలో మీరు ఆశించిన‌ట్టు ల‌క్ష‌లు వ‌స్తాయి. దీంతో ఇప్పుడు ఇలాంటి కాయిన్స్ కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది. ఇప్పుడు ఈ కాయిన్స్ ను ల‌క్ష‌ల రూపాయాలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు.
ఇక రూ. 5, రూ. 10 రూపాయ‌ల నోట్లు మీ వ‌ద్ద ఉంటే రూ. 30వేల దాకా మీరు సంపాదించుకోవ‌చ్చు. అయితే,ఆ నోట్ల మీద ట్రాక్ట‌ర్ బొమ్మ ఉండాలి. ఒక వేళ ఆ నోటుపై 786 నెంబ‌ర్ ఉంటే ఇంకా ల‌క్కీ..మీకు ఎక్కువ‌గా డ‌బ్బు వ‌స్తుంది. ఇలాంటి వైర‌ల్ న్యూస్ ను కాయిన్ బ‌జార్ అనే వెబ్ సైట్ లో పెట్టారు. ఒక వేళ మీద వ‌ద్ద పాత రూ. 1 నోటు ఉండీ..అది ఆ వెబ్ సైట్ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా ఉంటే రూ. 45వేలు పొంద‌డానికి వీలుంది. అందుకోసం మీరు వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. మీ వ‌ద్ద ఉన్న క‌రెన్సీ కాయిన్ లేదా క‌రెన్సీ నోట్ల ఇమేజ్ ల‌ను అప్ లోడ్ చేయాలి. దాంతో అది వేలానికి అందుబాటులోకి వ‌స్తుంది. అప్పుడు ఎవ‌రైనా ఆస‌క్తిగ‌ల వాళ్లు మిమ్మ‌ల్ని సంప్ర‌దించ‌డం ద్వారా వాటిని కొనుగోలు చేస్తారు.
విచిత్రంగా వెబ్ సైట్ లో పెట్టిన ష‌ర‌తు ఇలా ఉంది. మీ వ‌ద్ద ఉన్న రూ. 1నోటుపై 1957 నాటి గ‌వ‌ర్న‌ర్ హెచ్ఎం ప‌టేల్ సంత‌కం, సీరియ‌ల్ నెంబ‌ర్ 123456 ఉండాలి. కానీ, రూ. 1నోటును భార‌త ప్ర‌భుత్వం 26ర ఏళ్ల క్రిత‌మే నిలిపివేసింది. మ‌ళ్లీ 2015లో ఆ నోటును పున‌రుద్ద‌రించారు. ఓల్డ ఈజ్ గోల్డ అన్న‌ట్టు పాత వాటికి ఉండే విలువ వేరు. అందుకే పాత కాయిన్లు, క‌రెన్సీ నోట్ల‌కు వేలంలో ఆక‌ర్ష‌ణీయ‌మైన ధ‌ర ప‌లుకుతోంది.