Site icon HashtagU Telugu

Gorakhpur BJP MP : గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీకి ఏడాదిన్న‌ర జైలు శిక్ష‌

Bjp

Bjp

గోర‌ఖ్‌పూర్ బీజేపీ ఎంపీ క‌మ‌లేష్ పాశ్వాన్‌కి ఏడాదిన్న‌ర జైలు శిక్ష ప‌డింది. 2008లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, శివపాల్‌ యాదవ్‌ల అరెస్టుకు వ్యతిరేకంగా రోడ్డును బ్లాక్ చేసినందుకు ఆయ‌న‌కు కోర్టు శిక్ష విధించింది.అయితే 2008లో ఘటన జరిగినప్పుడు కమలేష్ పాశ్వాన్ సమాజ్ వాదీ పార్టీలో ఉన్నారు. క‌మ‌లేష్ పాశ్వాన్ ఇప్పుడు గోరఖ్‌పూర్‌లోని బన్స్‌గావ్ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ప‌ద‌విలో ఉన్నారు. జనవరి 2008లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఆయ‌న మేనమామ శివపాల్ యాదవ్‌ల అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నప్పుడు క‌మ‌లేష్ పాశ్వాన్‌పై కేసు న‌మోదు అయింది.