Site icon HashtagU Telugu

Bangalore: శాస్త్రవేత్తను కత్తులతో వెంబడించి కారు అద్దాలు ధ్వంసం చేసిన గుండాలు?

Bangalore

Bangalore

ఇటీవల కాలంలో బెంగుళూరులో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది. నిత్యం పదుల సంఖ్యలో మనుషులపై అఘాయిత్యాలు దాడులు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మనుషులు మానవత్వాన్ని మరిచి బరితెగించి రోడ్లపైనే హత్యలు చేస్తున్నారు. ఇలాంటి కేసులు కొన్ని నెలల నుంచి వరుసగా జరుగుతున్నాయి. తాజాగా కూడా ఒక శాస్త్రవేత్తను కొంతమంది లోకల్ గుండాలు కత్తులతో వెంబడించారు. ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాలను ఆ శాస్త్రవేత్త ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అసలేం జరిగిందంటే..

ఆగస్టు 24వ తేదీన మధ్యాహ్నం 12:45 గంటలకు కారులో వెళుతుండగా రౌతనహళ్లి రోడ్డు వద్ద కొంత మంది రౌడీలు అశుతోష్ సింగ్ అనే సైంటిస్ట్ కారును ఆపడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా పెద్ద పెద్ద కత్తులతో వారు ఆయన వెంటపడ్డారు. దాడిలో ఆయన కారు అద్దాన్ని వారు ధ్వంసం చేశారు. ఎలాగొలా వారి బారి నుంచి తప్పించుకున్న ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఇంతవరకు సరిగా స్పందించకపోవడంతో ఆయన ట్విటర్ ద్వారా జరిగిన విషయంతో పాటు పగలగొట్టిన తన కారు ఫోటోలను షేరు చేశారు. దీంతో ఈ ఘటనపై కర్ణాటక అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ స్పందించారు. వెంటనే వారిని పట్టుకొని వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ కేసుపై దర్యాప్తు చేయాలని తానే స్వయంగా అధికారులను ఆదేశిస్తానని, దగ్గరుండి కేసును పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసకుంటుందని ఆయన వెల్లడించారు. అంతేకాకండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు 112 నంబర్ కు కాల్ చేయాలని, పోలీసులు వెంటనే స్పందిస్తారని ఆయన పేర్కొ్న్నారు. ఇక సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాలో ఈ మధ్య నేరాలు నిజంగానే పెరిగిపోయాయంటూ అశుతోష్ సింగ్ ట్వీట్ కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పోలీసు శాఖ ఇటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేకపోతే నగరంలో రౌడీయిజం పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అయితే ఆ సైంటిస్ట్ ను కత్తులతో వెంబడించడానికి గల కారణం మాత్రం తెలియలేదు.

Exit mobile version