Site icon HashtagU Telugu

Software Job: గంటల్లో పని.. జీతం మాత్రం కోట్లలో.. ఇందులో నిజమెంత?

Earn Money Online

Software Job

ఈ రోజుల్లో వేలల్లో నుంచి లక్షలు, కోట్లు వచ్చే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అయితే జీతం కి తగ్గట్టుగానే పని కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ కొందరు మాత్రం లోపల కష్టపడుతున్న ఆ విషయాన్ని బయట పెట్టకుండా సంతోషంగా ఉన్నాము కోట్లు సంపాదిస్తున్నాము అని అపద్దాలు చెబుతూ ఉంటారు. తాజాగా ఒక ఉద్యోగి కూడా రోజుకి ఒక గంట పని చేసి ఏడాదికి రూ.1.50 లక్షల డాలర్ లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 1.20 కోట్లు సంపాదిస్తున్నాను అంటూ కుండబద్దలు కొట్టాడు.

అతని పేరు డేవాన్. అతని వయసు 20 ఏళ్ళు. గూగుల్‌ సంస్థలో అతడు పని చేస్తాడు. అయితే ఇతర ఉద్యోగుల మాదిరిగానే అతను కూడా రోజంతా కష్టపడనని, కేవలం గంట మాత్రమే పని చేస్తానని అన్నాడు. నిజానికి మేనేజర్‌ ఇచ్చే కోడ్‌ను పూర్తి చేసేందుకు కనీసం వారం రోజులు పడుతుందని, అయితే తాను కోడ్‌లో కీలకమైన భాగాన్ని ముందుగానే రాసుకుంటానని డేవాన్ తెలిపాడు. మిగిలిన పనిని వారం రోజుల్లోపు తాపీగా పూర్తి చేస్తానని అన్నాడు. అయితే తాను కోడ్ రాయడానికి కేవలం గంట సమయాన్ని మాత్రమే కేటాయిస్తానని అన్నాడు.

ఉదయం అల్పాహారం చేశాక గంట పాటు గూగుల్ కోసం పని చేస్తానని మిగిలిన సమయాన్ని తన స్టార్టప్‌ కోసం వినియోగిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే మిగిలిన కంపెనీలతో పోలిస్తే గూగుల్‌లో పని చేసే వారికి చాలా ప్రయోజనాలుంటాయని ఎందరో ఇంజనీర్లు గొప్ప జీతాలు అందుకుంటున్నారని వారిలో తానొకడినని అన్నాడు. ప్రస్తుతం అతడిచ్చిన ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది ఇది ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు.

Exit mobile version