Kamala Sohonie : నోబెల్ గ్రహీత సీవీ రామన్ నో చెప్పినా..పీహెచ్ డీ సాధించి చూపిన కమలా సోహోనీ

Kamala Sohonie : గూగుల్ హోమ్ పేజీ చూశారా ? ఇంకా చూడకపోతే ఇప్పుడు చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి..  సైన్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందిన మొదటి భారతీయ మహిళ డాక్టర్ కమలా సోహోనీ 112వ పుట్టినరోజును గూగుల్ డూడుల్ జరుపుకుంటోంది. 

Published By: HashtagU Telugu Desk
Kamala Sohonie

Kamala Sohonie

Kamala Sohonie : గూగుల్ హోమ్ పేజీ చూశారా ?

ఇంకా చూడకపోతే ఇప్పుడు చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి.. 

సైన్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందిన మొదటి భారతీయ మహిళ డాక్టర్ కమలా సోహోనీ. 

ఈరోజు ఆమె 112వ పుట్టినరోజును గూగుల్ డూడుల్ (Google Doodle) జరుపుకుంటోంది. 

డాక్టర్ కమలా సోహోనీ 1912లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి నారాయణరావు భగవత్ రసాయన శాస్త్రవేత్త, ఆమె మామ మాధవరావు భగవత్ కూడా రసాయన శాస్త్రవేత్త. కమలా సోహోనీ వారి అడుగుజాడలను అనుసరించారు. 1933లో బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి కెమిస్ట్రీ (ప్రిన్సిపల్), ఫిజిక్స్ (సబ్సిడరీ)లో BSc పట్టా పొందారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సోహోనీ రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేశారు. అయితే ఆమె దరఖాస్తును అప్పటి డైరెక్టర్, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ సీవీ రామన్ తిరస్కరించారు. మహిళలు పరిశోధనలకు సరిపోరని సీవీ రామన్ నమ్మారు. దీంతో కమలా సోహోనీ(Kamala Sohonie) పట్టుదల మరింత పెరిగింది. సీవీ రామన్ తీసుకున్న నిర్ణయం తప్పు అని నిరూపించాలని ఆమె డిసైడ్ అయ్యారు.  ఆమె తన ఫ్యామిలీ సపోర్ట్ తో బ్రిటన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరి.. 1939లో బయోకెమిస్ట్రీలో పీహెచ్ డీ  సంపాదించారు. PhD పూర్తి చేసిన తర్వాత, సోహోనీ భారతదేశానికి తిరిగి వచ్చి న్యూ ఢిల్లీలోని లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీగా చేరారు.

Also read : Neera: వామ్మో నీరా తో ఎక్కువగా అన్ని రకాల ప్రయోజనాలా?

నీరాపై రీసెర్చ్.. డాక్టర్ సోహోనీకి రాష్ట్రపతి అవార్డు 

తాటి చెట్టు నుంచి సీకరించే నీరా పానీయంలోని పోషక విలువలపై సోహోనీ స్టడీ చేశారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని నీరా మెరుగుపరుస్తుందని నిరూపించారు. నీరాపై చేసిన రీసెర్చ్ కుగానూ డాక్టర్ సోహోనీకి రాష్ట్రపతి అవార్డు లభించింది. ఆమె కూనూర్‌లోని న్యూట్రిషన్ రీసెర్చ్ ల్యాబ్‌లో, బొంబాయి (ముంబై)లోని రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పనిచేశారు. పప్పుధాన్యాల పోషక విలువలు, పిల్లలపై పోషకాహార లోపం  ప్రభావాలతో సహా బయోకెమిస్ట్రీకి సంబంధించిన వివిధ అంశాలపై పరిశోధనలు చేశారు. బొంబాయిలోని రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు తొలి మహిళా డైరెక్టర్‌గా కూడా ఆమె సేవలు అందించారు. సోహోనీ 1998లో తన 86వ ఏట మరణించారు.

  Last Updated: 18 Jun 2023, 10:32 AM IST