Site icon HashtagU Telugu

Google Chrome: లోగోను మార్చేసిన‌ గూగుల్.. త‌ల‌లు ప‌ట్టుకుంటున్న నెటిజ‌న్లు

Google Chrome Logo

Google Chrome Logo

ఇంటర్‌నెట్‌ అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది గూగుల్‌. ఎన్నో రకాల వెబ్‌ బ్రౌజర్లు అందుబాటులో ఉన్నా, ఎక్కువ మంది యూజ‌ర్లు గూగుల్ కోమ్ లోనే బ్రౌజ్ చేస్తారు. సెర్చ్ ఇంజ‌న్స్‌లో అంతగా పాపుల‌ర్ అయ్యింది గూగుల్ క్రోమ్. అయితే ఇప్పుడు తాజాగా మ్యాట‌ర్ ఏంటంటే గూగుల్ సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అప్పుడ‌ప్పుడూ లోగో మారుస్తుండే గూగుల్, 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత గూగుల్ క్రోమ్ లోగోను మార్చాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

గూగుల్ క్రోమ్ లోగో అనగానే మ‌న‌కు గుర్త‌కు వ‌చ్చేది రౌండ్ షేప్‌లో ఉండే ఓ ఆకారం. అప్పుడప్పుడూ ఈ లోగోలో స్వల్ప మార్పులు వస్తూ ఉన్నాయి. గతంలో 2014లో లోగోలో మార్పులు చేసిన గూగులు, తిరిగి ఎనిమిది ఏళ్ళ త‌ర్వాత‌ ఇప్పుడు లోగోలో స్వల్ప మార్పులు చేస్తూ, గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ క్ర‌మంలో క్రోమ్ కొత్త ఐకాన్ గమనించారా.. 8 ఏళ్ల తరువాత తిరిగి ఐకాన్ రీఫ్రెష్ అయిందంటూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. అయితే గూగుల్ క్రోమ్ లోగోలో కొత్త‌గా చేసిన మార్పులు అర్ధంకాక యూజ‌ర్లు, నెటిజ‌న్లు బుర్ర‌ప‌ట్టుకుంటున్నారు.

లోగో మార్చానంటూ చెప్పి..వినియోగదారులకు పరీక్ష పెట్టింది గూగుల్. పాత లోగోలో క‌నిపించే నాలుగు రంగులే, కొత్త లోగోలో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ రంగులు కొంత మెరుస్తుండటం విశేషం. మధ్యలో ఉండే నీలిరంగు వృత్తాన్ని కాస్త పెద్దదిగా చేశారు. ప్ర‌త్యేకంగా పరిశీలించి చూస్తేనే కొత్త‌ లోగోలో చేసిన మార్పులు క‌నిపిస్తున్నాయి. దీంతో గూగుల్ లోగో మార్పుపై పలు ఫన్నీ మీమ్స్‌, కామెంట్ల‌తో సోషల్‌ మీడియాలో నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ గూగుల్ క్రోమ్ న‌యా లోగో త్వరలోనే డెస్క్ టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని ఎల్విన్ హు వెల్లడించారు.

Exit mobile version