KTR: ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఈ మేరకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో KTR ని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ భవన్ లోనే కలిసిన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ రవిచంద్ర తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు కేటీఆర్ కు గ్రీటింగ్స్ తెలియజేశారు.
కాగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికలపై పూర్తిగా ద్రుష్టి సారించింది. తెలంగాణ లోక్ స్థానాల్లో ఎవరిని పోటీకి దింపాలో ఇప్పట్నుంచే కార్యాచరణ తయారుచేస్తోంది. ఇందులో భాగంగా కేటీఆర్ ఆయా పార్లమెంట్ స్థానాలపై గురి పెట్టారు. స్థానిక నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తూ సత్తా చాటాలని కేటీఆర్ భావిస్తున్నారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఒడిపోయిన ఎమ్మెల్యేలు.. ఎంపీగా బరిలోకి దిగాలని ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు.