Site icon HashtagU Telugu

AP Govt : డ్వాక్రా మహిళలకు శుభవార్త

Andhra Pradesh Dwcra Womens

Andhra Pradesh Dwcra Womens

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల (Dwakra Womens) అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది మార్చి నెలలోపు రాష్ట్రంలోని 88 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.61,964 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ ఆర్థిక మద్దతుతో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు వీలవుతుంది. రుణాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

DC vs RCB: ప్ర‌తీకారం తీర్చుకున్న బెంగ‌ళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘ‌న‌విజ‌యం!

డ్వాక్రా మహిళలు తమ అభిరుచులు, నైపుణ్యాల ఆధారంగా తగిన రంగాల్లో శిక్షణ పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్, పశుసంపద, సెరికల్చర్ వంటి కీలక రంగాల్లో తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందే మార్గాలను గుర్తించి, సంబంధిత రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మహిళలు స్వయం ఉపాధిని సాధించి తమ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసుకునే అవకాశాలు పెరుగుతాయి.

అంతేకాక ఆధునిక వ్యవసాయ విధానాల్లో భాగంగా డ్రోన్ల వినియోగం, మినీ రైస్ మిల్స్ స్థాపన, తృణధాన్యాల సాగు, సేంద్రియ వ్యవసాయం వంటి రంగాల్లో కూడా మహిళలకు రుణ సౌకర్యాలు కల్పించనున్నారు. వీటితో పాటు తృణధాన్యాల ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి కూడా ప్రోత్సాహం అందించనుంది. ఈ చర్యలతో గ్రామీణ మహిళలు కొత్త అవకాశాలను అన్వేషించి, కొత్త వ్యవసాయ రంగాల్లో ప్రావీణ్యం సాధించే దిశగా ముందుకు సాగనున్నారని అధికారులు పేర్కొన్నారు.