WhatsApp: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే అలాంటి సూపర్ ఫీచర్!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 10:30 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ వాట్సాప్ ను నిత్యం ఉపయోగిస్తూనే ఉంటారు. అయితే వాట్సాప్ వినియోగదారుల కోసం ఆయా సంస్థ వారు ఎన్నో రకాల ఫీచర్ లను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అయితే ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్ లు అందుబాటులోకి వచ్చినప్పటికీ వినియోగదారుల కోసం మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకుని రావడానికి తరచుగా శ్రమిస్తూనే ఉన్నారు వాట్సాప్ సంస్థ వారు. ఇది ఇలా ఉంటే తాజాగా వాట్సాప్ లో మరొక సరికొత్త ఫీచర్ నీ అందుబాటులోకి తీసుకుని వచ్చారు.

ఇకపోతే మామూలుగా వాట్సాప్ గ్రూపులలో ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్లను మరొకరు డిలీట్ చేయలేరు. కేవలం మెసేజ్ పెట్టిన వాళ్ళు మాత్రమే ఆ మెసేజ్ ని డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. అదేమిటంటే గ్రూప్ అడ్మిషన్ లను ఎవరి మెసేజ్ నైనా డిలీట్ చేసే అధికారం లభిస్తుంది. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా వాట్సాప్ గ్రూపులో సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. గ్రూప్ అడ్మిషన్ లకు గ్రూప్ మరింత కంట్రోల్ తీసుకువచ్చేందుకు వాట్సాప్ లేటెస్ట్ గా ఈ ఫ్యూచర్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

కాగా ఇప్పటికే ఈ ఫీచర్ బీటా టెస్టర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ఒకవేళ మీరు కనుక వాట్సాప్ బీటా టెస్టర్ అయితే మీ ఆప్ అప్డేట్ చేసి ఈ ఫీచర్ ని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా గ్రూపులో అడ్మిషన్ గా ఉన్నట్టు అయితే ఆ గ్రూపులో వచ్చే మెసేజెస్ ని డిలీట్ చేసే అధికారం మీకు లభిస్తుంది. అయితే ఈ సరికొత్త ఫీచర్ వాట్సాప్ లో వచ్చిందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే, మీరు అడ్మిషన్ గా ఉన్న గ్రూప్ లో ఏదైనా మెసేజ్ ను లాంగ్ ప్రెస్ చేయండి. అప్పుడు డిలీట్ చేసే ఆప్షన్ కనిపిస్తే ఈ ఫీచర్ మీకు లభించినట్టే. అదేవిధంగా గ్రూప్ అడ్మిషన్లు ఎవరి మెసేజ్ ను డిలీట్ చేసినా కూడా ఆ విషయం గ్రూప్ లో ఉన్న వారందరికీ కూడా తెలుస్తుంది.