తిరుమల శ్రీవారి భక్తలకు మరో శుభవార్త చెప్పింది టీటీడీ. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఏపీలో ఇటీవల కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆఫ్‌లైన్‌లో భక్తులకు రోజుకు 20 వేల సర్వదర్శనం టికెట్లను జారీ చేస్తోంది. ఇక పై ప్రతి రోజూ ఆఫ్‌లైన్ సర్వదర్శనం టికెట్లను జారీ చేయనుంది.
అలాగే ఈ నెల 24వ తేదీ నుంచి 300కే ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల కోటాను 25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.బుధవారం నుంచి ఫిబ్రవరి 24 నుంచి మార్చి 31వ తేదీకి సంబంధించిన టోకెన్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. దీంతో కరోనా కారణంగా కొద్ది రోజులుగా ఆన్‌లైన్ టికెట్స్ కారణంగా చాలా మంది భక్తులు శ్రీవాని దర్శించుకోలేక పోతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆఫ్‌లైన్ టికెట్స్ కూడా భక్తలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.
