TS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్…మరో 2670కొత్త పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాల జాతర షురూ అవుతోంది.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 07:31 AM IST

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాల జాతర షురూ అవుతోంది. గత మార్చి నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఈ విషయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో భాగంగానే వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. పోలీస్, గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. దానితర్వాత TSPSC నుంచి ప్రత్యేక అర్హత కలిగి ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు వెలువడుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే పలు పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి క్లీయరెన్స్ వచ్చింది. TSPSC నుంచి మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఈనెల చివరి వరకు వచ్చే ఛాన్స్ ఉంది.

తాజాగా మున్సిపాలిటీ నుంచి కొత్తగా 2670పోస్టులు మంజూరు అయ్యాయి. వీటిని కూడా గ్రూప్ 4 కింద బర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కింద ఆరు రకాల కేటగిరీల కింద ఈ పోస్టులను రూపొందించారు. విభాగాల వారీగా పోస్టులు చూసినట్లయితే..
1. జూనియర్ అకౌంట్ ఆఫీసర్ 07
2. సీనియర్ అకౌంటెంట్ 37
3. సీనియర్ అసిస్టెంట్ 138
4.జూనియర్ అకౌంటెంట్ 94
5. జూనియర్ అసిస్టెంట్ 122
6. వార్డ్ ఆఫీసర్ 2242

ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలోనే ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చి…నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.