Site icon HashtagU Telugu

Free WiFi – RTC Buses : ఆ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై .. గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్

Tsrtc Imresizer

Tsrtc Imresizer

Free WiFi – RTC Buses :  ఆర్టీసీ ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నామంటూ ఆయన ఇవాళ ఉదయం  ట్వీట్ చేశారు. కొన్ని బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. అనధికారిక సమాచారం ప్రకారం.. తొలి విడతగా హైటెక్ హంగులతో కొత్తగా ప్రవేశపెట్టిన 16 ఏసీ స్లీపర్ బస్సులలో ఫ్రీ వైఫై ను అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తిరుపతి.. తమిళనాడులోని చెన్నై రూట్లలో నడుస్తాయని సమాచారం. ఇటీవల ఈ బస్సులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ప్రారంభించారు.

Also read : Krishna Janmashtami 2023 : కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలను పఠిస్తే..మీ కోరికలు ఇట్టే తీరిపోతాయి

వీటికి కూడా నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే.. ‘లహరి.. అమ్మఒడి.. అనుభూతి’ అని పేర్లు  పెట్టారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ సదుపాయాన్ని కల్పించారు. వీటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. 12 మీటర్ల పొడవు ఉండే ఏసీ స్లీపర్ బస్సుల్లో… 15 లోయర్ బెర్త్‌లు, 15 అప్పర్ స్లీపర్ బెర్త్‌లు ఉంటాయి. బెర్త్‌ల వద్ద మొబైల్ చార్జింగ్, రీడింగ్ ల్యాంప్ సౌకర్యాలు ఉంటాయి. ఈ బస్సుల్లో ఉచిత వై ఫై సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునిక ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం ఏర్పాటు చేశారు.