Site icon HashtagU Telugu

TS GOVT : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు తీపి కబురు..!!

power

power

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది సర్కార్. జెన్ కో, ట్రాన్స్ కో తోపాటు అన్ని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచుతూ సీఎండీ ప్రభాకర్ రావు అదివారం రాత్రి ఉత్వర్వులు జారీ చేశారు. జూలై నెల నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి.

అయితే ఆగస్టులో అందుకునే జీతంలో కలిపి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 24.992శాతం డీఏను 3.646శాతానికి పెంచి 28.638శాతం చేస్తున్నట్లు ప్రభాకరరావు ప్రకటించారు. జూలై నుంచి అమల్లోకి రానున్నందున ఆ నెల జీతంతో కలిపి బకాయిలను ఆగస్టులో అందుకునే వేతనంతో ఇస్తున్నట్లు స్పష్టంచేశారు.