Telangana: ఏప్రిల్ నెలలో స్కూల్స్, కళాశాలలకు వరుస సెలువులు రానున్నాయి. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి ఫెస్టివల్స్ నేపథ్యంలో వారం రోజుల్లో వరుసగా 4 రోజులు సెలవలు రానున్నాయి. వీటితో పాటు.. సెకండ్ సాటర్ డే, సండే కూడా ఉండటంతో.. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 17 మధ్య స్కూళ్లలకు వరసగా సెలవులు రానున్నాయి. తెలంగాణ ఈసారి వేసవి సెలవులు.. ఏప్రిల్ 18 లేదా ఏప్రిల్ 20 నుంచి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇక హోలీ నేపథ్యంలో మార్చి 25న కూడా తెలంగాణ సర్కార్ సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే.తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే.
కాగా తెలంగాణలో ఇప్పటికే హాప్ డే స్కూల్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ, నారాయణపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.