Site icon HashtagU Telugu

ST Reservation: ఎస్టీలకు గుడ్ న్యూస్…ఇవాళ్టి నుంచే 10 శాతం రిజర్వేషన్లు…అర్థరాత్రి ఉత్తర్వులు..!!

Kcr Assembly

Kcr Assembly

తెలంగాణ సర్కార్ గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారంతా ఎదురుచూస్తున్న ఎస్టీ రిజర్వేషన్ల జీవోను జారీ చేసింది ప్రభుత్వం. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణ సర్కార్ శుక్రవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇది తక్షణం అమల్లోకి వచ్చినట్లుగా పేర్కొంది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల స్థితిగతులను పరిగణలోనికి తీసుకుని…6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.

నిన్న యాదాద్రి పర్యటనలో ఉన్న సీఎం…రాత్రి ప్రగతి భవన్ చేరుకోగానే…ఎస్టీ రిజర్వేషన్లపై సమీక్షించారు. అనంతరం ఆమోదం తెలిపారు. ఈ జీవో ప్రకారం నేటి నుంచి విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల నియామాకాల్లో గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ విషయాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

కాగా అర్థరాత్రి జీవో జారీ చేసిన వెంటనే…గిరిజన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సంబురాలు చేసుకుంటున్నాయి. బంజారాహిల్స్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో మంత్రి సత్యవతి రాథోడ్ నివాసం వద్ద గిరిజన సంఘాలు బాణా సంచా కాల్చి సంబురాలు చేసకున్నారు. సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

Exit mobile version