Special Trains Extended : ఈ రూట్లలో స్పెషల్ రైళ్లు ఇంకొన్నాళ్లు పొడిగింపు

Special Trains Extended : వారానికి ఒకరోజు నడిచే స్పెషల్ రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్ధం మరికొన్నాళ్లకు పొడిగించారు. 

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 09:54 AM IST

Special Trains Extended : వారానికి ఒకరోజు నడిచే స్పెషల్ రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్ధం మరికొన్నాళ్లకు పొడిగించారు.  కొన్ని ట్రైన్లను సెప్టెంబరు చివరి వారం వరకు, మరికొన్ని ట్రైన్లను అక్టోబరు 3 వరకు పొడిగించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఆ ట్రైన్లలో ప్రయాణికుల రద్దీ  బాగానే ఉన్న రీత్యా వాటి సర్వీసులను ఇంకొన్నాళ్లు కొనసాగించాలని నిర్ణయించామని తెలిపింది. ఈ ట్రైన్లలో టికెట్ చార్జీలు కొంచెం అదనంగా ఉంటాయి.

సర్వీసులను పొడిగించిన స్పెషల్ ట్రైన్లు ఇవే.. 

కాజీపేట- దాదర్‌ మధ్య నడిచే ట్రైన్ ( ప్రతి బుధవారం, ట్రైన్ నెంబర్ 07195), దాదర్‌- కాజీపేట (ప్రతి గురువారం, ట్రైన్ నెంబర్ 07196), కాజీపేట- దాదర్‌ ( ప్రతి శనివారం ట్రైన్ నెంబర్ 07197), దాదర్‌- కాజీపేట ( ప్రతి ఆదివారం ట్రైన్ నెంబర్ 07198), దానాపుర్‌- సికింద్రాబాద్‌ (ప్రతి సోమవారం ట్రైన్ నెంబర్ 07420), సికింద్రాబాద్‌- రాక్సల్‌ ( ప్రతి బుధవారం ట్రైన్ నెంబర్ 07007), హైదరాబాద్‌- రాక్సల్‌ ( ప్రతి శనివారం ట్రైన్ నెంబర్ 07051),  రాక్సల్‌ -సికింద్రాబాద్‌ (ప్రతి మంగళవారం ట్రైన్ నెబంర్ 07052),  హైదరాబాద్‌- జైపుర్‌ ( ప్రతి శుక్రవారం ట్రైన్ నంబర్ 07115), జైపుర్‌-హైదరాబాద్‌ ( ప్రతి ఆదివారం ట్రైన్ నంబర్ 07116), సికింద్రాబాద్‌- దానాపుర్‌ ( ప్రతి శనివారం ట్రైన్ నంబర్ 07419), రాక్సల్‌- సికింద్రాబాద్‌ (ప్రతి శుక్రవారం ట్రైన్ నెబంర్ 07008), కాచిగూడ- బికనీర్‌ ( ప్రతి శనివారం ట్రైన్ నంబర్ 07053), బికనీర్‌- కాచిగూడ ( ప్రతి మంగళవారం ట్రైన్ నెంబర్ 07054) రైళ్ల సర్వీసులను (Special Trains Extended) పొడిగించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రైల్వే ప్రయాణికులను కోరారు.