Railways: సమ్మర్ సందర్భంగా భారతీయ రైల్వేశాఖ ప్రత్యేక రైళ్ల సర్వీసులను నడుపుతోంది. వేసవి కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. దీంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను రైల్వేశాఖ ప్రకటిస్తోంది. రద్దీగా ఉన్న మార్గాలు, ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా తాజాగా వైజాగ్ నుంచి పలు ప్రాంతాలకు తిప్పుతున్న ప్రత్యేక రైలు సర్వీసులు దక్షిణ మధ్య రైల్వేశాఖ పొడిగించింది.
వేసవి రద్దదీద కారణంగా విశాఖపట్నం నుంచి పలు నగరాలకు 44 ప్రత్యేక రైలు సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది. ఈ రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది. ఈ వీక్లీ ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు అధికారులు కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర, తిరుపతి, బెంగళూరు మధ్య ఈ ప్రత్యేక రైళ్లు వారాంతరాల్లో అందుబాటులో ఉంటున్నాయి.
మే 1 నుంచి జూన్ 29వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం-మహబూబ్ నగర్(08585) ట్రైన్ ప్రతి మంగళవారం సాయంత్రం 5.35 గంటలకు విశాఖలో బయలుదేరి మరసటి రోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్ నగర్ చేరుకుంటుంది. అలాగే మహబూబ్ నగర్-విశాఖపట్నం ట్రైన్(08586) రైలు ప్రతి బధవారం సాయంత్రం 6.20 గంటలకు మహబూబ్ నగర్ లో బయల్దేరి మరసటిరోజు ఉదయం 9.50 గంటలకు వైజాగ్ కు చేరుకుంటుంది.
దువ్వాడ, సామర్లకొట, రాజమండ్రి,ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ , నల్లగొండ, మల్కాజ్ గిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల మీదుగా ఈ ట్రైన్ వెళుతుంది. ఇక విశాఖ, బెంగళూరు మధ్య రాకపోకలు సాగించే ప్రత్యేక రైలు దువ్వాడ, సామర్లకొట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్ పేట్, కుప్పం, బంగారపేట్, కృష్ణరాజపురం రైల్వేస్టేషన్లలో ఆగుతుంది