Site icon HashtagU Telugu

TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, రేపట్నుంచి ఆ రూట్లో ఏసీ బస్సులు ప్రారంభం

Ac Buses

Ac Buses

TSRTC: డిసెంబర్ 15 నుంచి సికింద్రాబాద్- పటాన్‌చెరు మార్గంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రకటించింది. ఈ బస్సులు శుక్రవారం (తేదీ: 15.12.2023) నుంచి ప్రారంభమవుతాయి. ఈ మార్గంలో ప్రతి 24 నిమిషాలకు ఒక ఏసీ మెట్రో బస్సు అందుబాటులో ఉంటుంది.

రూట్ నంబర్ 219 ఉన్న ఈ బస్సులు ప్యారడైజ్, బోయిన్‌పల్లి, బాలానగర్, కూకట్‌పల్లి మీదుగా పటాన్‌చెరు చేరుకుంటాయి. ఆ తర్వాత అదే మార్గంలో తిరిగి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని TSRTC కోరుతోంది, ”అని సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ లో తెలిపారు.

హైదరాబాద్ రోడ్లపై త్వరలో మొత్తం 50 ‘గ్రీన్ మెట్రో లగ్జరీ’ పూర్తి ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని సెప్టెంబర్‌లో TSRTC తెలిపింది. 35 సీట్ల కెపాసిటీ కలిగిన ‘గ్రీన్ మెట్రో లగ్జరీ’ బస్సు పూర్తిగా ఛార్జ్ కావడానికి 3-4 గంటల సమయం పడుతుందని, ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల దూరాన్ని ఒకే ఛార్జ్ లో కవర్ చేయగలదని తెలిపింది.