Spam Calls: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి స్పామ్ కాల్స్‌కు చెక్

మొబైల్ వాడేవారికి ట్రాయ్ గుడ్ న్యూస్ తెలిపింది. స్పామ్ కాల్స్ కు చెక్ పట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం చర్యలు చేపట్టింది.

  • Written By:
  • Publish Date - May 1, 2023 / 11:08 PM IST

Spam Calls: మొబైల్ వాడేవారికి ట్రాయ్ గుడ్ న్యూస్ తెలిపింది. స్పామ్ కాల్స్ కు చెక్ పట్టే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం చర్యలు చేపట్టింది. దీని కోసం ట్రాయ్ కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. కొంతమంది మోసగాళ్లు కాల్స్ చేసి ఏదోక మాయ చేసి డబ్బులు కాజేస్తారు. ఇలాంటి స్పామ్ కాల్స్ నుంచి ట్రాయ్ విముక్తి కలిగించనుంది. నేటి నుంచి స్పామ్స్ కాల్స్ కి సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.

టెలికాం ఆపరేటర్లు స్పామ్ కాల్స్ ను గుర్తించేందుకు ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించాలి. స్పామ్ ఫిల్టర్స్ ను ఉపయోగించాలని ట్రాయ్ తన నిబంధనల్లో పేర్కొంది. ఈ ఫిల్టర్స్ వేర్వేరు వ్యక్తుల నుంచి లేదా సంస్థ నుంచి వచ్చే నకిలీ, మార్కెటింగ్ కాల్స్, మెస్సేసజ్ లను గుర్తించాలి. దీని ద్వారా స్పామ్ కాల్స్ ను యూజర్లు సులువుగా గుర్తించవచ్చు. ఈ విధానాన్ని టెలికాం ఆపరేటర్లు తప్పనిసరిగా ప్రవేశపెట్టాలని ఇదేశించింది. మొబైల్ యూజర్లు స్పామ్ లేదా స్కామ్ కాల్స్ నుంచి రక్షణ కల్పించాలని సూచించింది.

అయితే ప్రస్తుతానికి ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ లాంటి సంస్థలు ఈ సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి. ఎయిర్ టెల్ ఇప్పటికే ఈ సేవలను అమలు చేస్తుండగా.. జియో కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పుకొచ్చింది. టెలికాం సంస్థలు 10 అంకెల మొబైల్ నెంబర్ ద్వారా చేసే ప్రమోషనల్ కాల్స్ ను అనుమతింవద్దని టెలికాం ఆపరేటర్లకు ట్రాయ్ సూచించింది. అలాగే ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకునేందుకు వీలుగా కాల్ చేస్తున్న వ్యక్తి పొటో కనిపించేలా కాలర్ ఐడీ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది.

అయితే కొన్ని టెలికాం సంస్థలు వ్యక్తి ఫొటోను ప్రదర్శించేందుకు నిరాకరిస్తున్నారు. యూజర్ల గోప్యత కారణంగా అందుకు నిరాకరిస్తున్నాయి. దీంతో దీనిపై చర్చించేందుకు ట్రాయ్, టెలికాం సంస్థలు మరోసారి సమావేశం కానున్నాయి.