Site icon HashtagU Telugu

Medaram: మేడారం భక్తులకు గుడ్ న్యూస్, జాతరలో ప్రత్యేక మొబైల్‌ యాప్ ప్రారంభం

Medaram Jatara 2024

Medaram Jatara 2024

Medaram: నిత్యం వేల మంది భక్తులు మేడారం వెళ్లి వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతర జరిగే ఐదు రోజుల్లో కోటి మందికిపైగా వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భక్తుల కోసం అధికారిక వెబ్‌సైట్, ఆండ్రాయియ్‌ యాప్‌ను విడుదల చేసింది. వీటిలో మేడారం జాతరకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉంటుంది.

మేడారం అధికారిక వెబ్‌సైట్‌ https://www.medaramjathara.com , ఆండ్రాయిడ్‌ మొబైల్‌ యాప్‌ను ములుగు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ కృష్ణ ఆదిత్య ఆవిష్కరించారు జాతరలో ప్రత్యేక మొబైల్‌ యాప్, అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా భక్తులకు తాగునీటి వసతి స్థలాలు, మేడారం జాతర రూట్‌ మ్యాప్, జాతరలో తప్పిపోయిన పిల్లల ఆచూకీ తెలుసుకునే పాయింట్లు తెలుసుకోవచ్చు.

అంతేకాదు.. ప్రమాదాల సంఘటనల స్థలాలను తెలిపే అవకాశం, దర్శనం క్యూలైన్, పార్కింగ్‌ ప్లేస్, కోవిడ్‌ –19 టీకాలు వేసేందుకు వ్యాక్సినేషన్‌ పాయింట్లు, మెడికల్‌ క్యాంపులు, టాయిలెట్స్‌ పాయింట్స్, జిల్లా లోని పర్యాటక ప్రదేశాలు తెలుసుకోవచ్చు. భక్తుల సలహాలు, సూచనల మేరకే ఈ యాప్‌ను రూపొందించారు. జాతర విశిష్టత, వేడుకల ప్రత్యక్ష ప్రసారం కూడా ఈ యాప్, వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు.