Site icon HashtagU Telugu

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పెట్టుబడి సాయం విడుదల

Pm Kisan

Pm Kisan

ప్రధాన‌ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద రైతుల‌కు కేంద్ర‌ ప్రభుత్వం అందించే పెట్టుబ‌డి సాయం ప‌దో విడ‌త మొత్తాన్ని వ‌చ్చే నెల ఒక‌టో తేదీన ప్రధాన‌ మంత్రి న‌రేంద్ర‌ మోదీ రైతుల ఖాతాలో జ‌మ‌చేయ‌నున్నారు. వీడియోకాన్ఫరెన్స్ విధానంలో జ‌రిగే సమావేశంలో మోదీ పాల్గొని… రైతుల ఖాతాల్లో ప‌దో విడ‌త పెట్టుబ‌డి సాయాన్ని విడుద‌ల చేస్తారు. ఒక్కో రైతుకు రెండు వేల రూపాయ‌ల చొప్పున దాదాపు ప‌ది కోట్ల మంది రైతుల ఖాతాల్లో సుమారు 20 వేల కోట్ల రూపాయ‌లు జ‌మ‌చేయ‌నున్నారు. ప్రధానమంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద… ఏడాదికి ఆరు వేల రూపాయ‌ల చొప్పున మూడు విడ‌త‌ల్లో రైతులకు కేంద్ర‌ ప్రభుత్వం అందిస్తూ వ‌స్తోంది. ఈ సాయాన్ని నేరుగా రైతుల ఖాతాలో జ‌మ‌చేస్తారు.