Site icon HashtagU Telugu

TSRTC: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఉప్పల్ టెస్ట్ మ్యాచ్ కోసం TSRTC బ‌స్సులు

Tsrtc

Tsrtc

TSRTC: ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో రేప‌టి నుంచి ఐదు రోజుల పాటు ఇండియా వ‌ర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ లు జరుగుబోతున్న విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా క్రికెట్ అభిమానులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ చూసేందుకు అభిమానుల కోసం ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసింది.  ఈ మేరకు Hyderabad లోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియానికి 60 బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌లకు ప్రారంభ‌మై.. తిరిగి స్టేడియం 7 గంట‌ల వ‌ర‌కు స్టేడియం నుంచి ఈ బస్సులు బ‌య‌లుదేరుతాయి. ఈ ప్రత్యేక బ‌స్సుల‌ను వినియోగించుకుని మ్యాచ్ ను వీక్షించాల‌ని క్రికెట్ అభిమానుల‌ను టీఎస్ఆర్టీసీ కోరుతోంది.

భారత్(India)-ఇంగ్లాండ్‌(England) మధ్య ఐదు టెస్టు సిరీస్‌లలో(Test series) భాగంగా తొలి టెస్ట్ జరగనుంది. సొంత గడ్డపై భారత్‌ బలమైన జట్టు. ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం భారత్‌కు కంచుకోట. ఈ స్టేడియంలో టెస్టుల్లో భారత్‌ను ఓడించిన జట్టే లేదు. ఐదు టెస్టు మ్యాచ్‌లు ఇందులో జరగగా 4 టెస్టుల్లో టీమిండియా విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. వన్డేల్లోనూ టీమిండియాకే అత్యధికశాతం విజయాలు దక్కాయి. 2010లో భారత్-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో 111 పరుగులతో హర్భజన్‌సింగ్‌ సెంచరీ చేయడం విశేషం.

2012లో మరోసారి న్యూజిలాండ్‌తో భారత్‌ తలపిడింది. ఈ టెస్టులో ఇన్నింగ్స్, 115 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. పుజారా (159) ఈ మ్యాచ్‌లో రాణించాడు. మ్యాచ్‌లో అశ్విన్‌ 12 వికెట్లు తీసుకున్నాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 135 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 204 పరుగులతో పుజారా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. రేపు జరుగబోయే మ్యాచ్ లో భారత ఆటగాళ్లే రాణిస్తారని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.