Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 11:45 PM IST

Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్రభావం కారణంగా కోళ్ళు మృత్యువాత పడటంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. కోళ్ళతో పాటే గుడ్డు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

గతనెల్లో రూ.7 పలికిన గుడ్డు ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.6 నుంచి రూ.6.50 ధర పలుకుతోంది. హోల్సేల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.5.50 ధర పలుకుతోంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ గత నెల్లో చికెన్ ధరలు భగ్గుమన్నాయి. కేజీ రూ.300 ధర దాటేయడంతో మాంసాహార ప్రియులపై అదనపు భారం పడింది. బర్డ్ ఫ్లూ కారణంగా పెద్ద సంఖ్యలో కోళ్ళు మృత్యువాత పడటం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి కోళ్ళ సరఫరాను నిలిపివేయడం తదితర కారణాలతో చికెన్ ధరలు పెరిగాయి. మళ్లీ చాలా రోజుల తర్వాత ధరలు తగ్గాయి.