Good News for Employees: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈసారి 3 శాతం డీఏ?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)ను పెంచుతుంటుంది.

Good News for Employees : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి, జూలై నెలల్లో డీఏ (డియర్‌నెస్ అలవెన్స్)ను పెంచుతుంటుంది. ఈక్రమంలోనే ఈ ఏడాది జూలైలో డీఏ ఎంత పెరుగుతుంది ? అనే దానిపై చర్చ జరుగుతోంది. ఈసారి డీఏ పెంపు 3 శాతమా? 4 శాతమా? అనేది హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023 జనవరి 1న ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు (Employees) డీఏ పెరిగితే పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ పెరుగుతుంది. ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకు డీఏ, డీఆర్ లను పెంచుతుంటారు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం డీఏను నిర్ణయిస్తుంది. ఈ ఇండెక్స్ విలువ ప్రస్తుతం 132.7 పాయింట్స్ వద్ద ఉంది. రాబోయే నెలల్లోనూ ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.

ఈ లెక్కన డీఏ 3 శాతమే పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ 45 శాతానికి పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగులకు డీఏ అనేది వారి మూల వేతనం (బేసిక్ శాలరీ) లెక్కన చెల్లిస్తారు. దీన్ని సంబంధిత ఉద్యోగుల స్థాయిలో 7వ పే కమిషన్ యొక్క పే మ్యాట్రిక్స్‌ని ఉపయోగించి డిసైడ్ చేస్తారు. ప్రతీసారి సగటున 3 శాతం లేదా 4 శాతం మాత్రమే డీఏ పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్కన 2023 జూలైలో 3 శాతమే డీఏ పెరిగే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

దీనిపై జూలై తర్వాత అధికారిక ప్రకటన వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి గల సంస్థల ఉద్యోగులకు ఆరో పే కమిషన్ స్కేల్ ప్రకారం డీఏ 212 శాతం నుంచి 221 శాతానికి పెరిగింది. అప్పుడు పెరిగిన డీఏ 2023 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విడుదల కోసం ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన డీఏను పెంచుతుంది?

  1. కేంద్ర ప్రభుత్వం ఒక ఫార్ములా ఆధారంగా ఉద్యోగులకు డీఏ, డీఆర్‌లను సవరిస్తుంది. కింది సూత్రం ప్రకారం డీఏ, డీఆర్‌లను సవరిస్తారు ..
    డియర్‌నెస్ అలవెన్స్ శాతం = ((ఆల్ ఇండియా వినియోగదారుల ధరల సూచిక (ఆధార సంవత్సరం 2001=100) గత 12 నెలల సగటు -115.76)/115.76)x100.
  2. కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం: డియర్‌నెస్ అలవెన్స్ శాతం = ((ఆల్-ఇండియా వినియోగదారుల ధరల సూచీ (ఆధార సంవత్సరం 2001=100) గత 3 నెలలుగా -126.33)/126.33)x100.

ఎన్నికల బొనాంజా .. 8వ వేతన సంఘం ఏర్పాటుకు సన్నాహాలు

మరోవైపు కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశవ్యాప్తంగా 8వ వేతన సంఘాన్ని అమలు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో 8వ వేతన సంఘానికి ఈ ఏడాదే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.7వ వేతన సంఘం 2013లో ఏర్పడి.. 2016లో అమల్లోకి వచ్చింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం భారీగా పెరిగింది. అంటే ఈ లెక్కన 8వ వేతన సంఘంపై కేంద్రం ఈ ఏడాది ప్రకటన చేస్తే.. 2026 నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలోనే 8వ వేతన సంఘం అమలు ప్రణాళికకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అలాంటి ప్రకటనేమీ చేయలేదు. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునేందుకు 8వ వేతన సంఘం రూపంలో భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read:  IPL 2023: హ్యాట్రిక్‌ విజయంపై ఢిల్లీ కన్ను.. సన్‌రైజర్స్‌ గెలుపు బాట పట్టేనా ?