Site icon HashtagU Telugu

AP Liquor: ఏపీలో మందుబాబుల‌కు గూడ్ న్యూస్‌…!

Andhra Pradesh Liquor License Imresizer

Andhra Pradesh Liquor License Imresizer

ఏపీలో మ‌ద్యం ధ‌ర‌లు అధికం కావ‌డంతో మ‌ద్యంప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీనికి తోడు కొత్త బ్రాండ్ లు వ‌స్తుండ‌టంతో వాటిని తాగ‌లేక ప‌క్క రాష్ట్రం నుంచి మ‌ద్యాన్ని తెప్పించుకుంటున్నారు.అయితే తాజాగా ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మందుబాబుల్లో ఆనందం క‌లిగిస్తుంద‌ని చెప్పాలి. ప్రభుత్వం మ‌రోసారి మద్యం పన్ను రేట్లలో మార్పులు చేసింది. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధతను తీసుకొచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాట్, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ ప్రత్యేక మార్జిన్‌లో హేతుబద్ధత తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్‌) రకం మద్యంపై 5 నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు ధరలు తగ్గేందుకు అవకాశాలు  ఉన్నాయి.

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వస్తున్న అక్రమ మద్యం, రాష్ట్రంలో నాటు సారా తయారీని అరికట్టేందుకే ధరల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే వారంలో రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ప్రముఖ కంపెనీల బ్రాండ్ల మద్యం విక్రయించేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న వివిధ చర్యల కారణంగా రాష్ట్రంలో 37 శాతం మేర మద్యం వినియోగం తగ్గిందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ఈ ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.