Ayodhya: భక్తులు మంగళవారం నుంచి అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. రోజువారీ పూజాదికాలు యధావిధిగా మొదలవుతాయి. సుప్రభాత సేవతో స్వామివారిని అర్చకులు మేల్కొలుపుతారు. ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు.
తెల్లవారు జామున 6: 30 గంటలకు జాగరణ్ హారతిని స్వామవారికి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి ఉంటుంది. సాయంత్రం 7: 30 గంటలకు సంధ్యా హారతితో తలుపులను మూసివేస్తారు. స్వామివారి సేవా టికెట్లను బుక్ చేసుకోవడానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారిక వెబ్ సైట్ https://online.srjbtkshetra.org/#/loginను సందర్శించాల్సి ఉంటుంది. మొదట తమ మొబైల్ ఫోన్ నంబర్ను రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం ఆ నంబర్కు వచ్చే ఓటీపీ పొందుపర్చడంతో యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది. దీని ద్వారా లాగిన్ అయి, టికెట్ను బుక్ చేసుకోవచ్చు.
Also Read: MLC Kavitha: మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్