AP Govt: ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 06:56 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించాడు. ఈ ప్రక్రియను జూన్ 30లోగా పూర్తి చేయాలని, జూలై 1లోగా ఉద్యోగులు కొత్త వేతనాలు అందుకోవాలని జగన్ స్పష్టం చేశాడు. మిగిలిన 25 శాతం మంది ఉద్యోగులకు ప్రొబేషన్ పరీక్షలు రాయాలని ఆదేశాలు జారీ చేయాలని సూచించాడు. మార్చి మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.
కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పదవీ విరమణ వయసు పెంపు, పీఆర్సీ ప్రకటించి ఉద్యోగులకు ప్రభుత్వం మేలు చేసిందన్నారు.కారుణ్య నియామకాలు యుద్ధప్రాతిపదికన జరగాలని, గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీలను వినియోగించుకోవాలని అధికారులను జగన్ కోరాడు.
డిమాండ్‌ను బట్టి జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లో కోటాను పెంచేందుకు ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఆయన తేల్చిచెప్పారు. అయితే రిజిస్ర్టేషన్ల ప్రక్రియలో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జగన్ తీసుకున్న నిర్ణయంతో లక్షల మంది ఉద్యోగులు హ్యాపీ గా ఉంటడం గమనార్హం