బంగారం ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బంగారం కొనాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితిలో నెలకొన్నాయి. అయితే ఈ వారంలో బంగారు ధరల విషయానికి వస్తే.. ఒకరోజు బంగారం ధరలు పెరుగుతున్నాయి మరో రోజు తగ్గుతున్నాయి. కాగా నిన్న గోల్డ్ రేట్ తగ్గింది. ధంతేరాస్ కు రెండు రోజుల ముందు నిన్న ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాదులో తాజాగా 22 క్యారెట్ 24 క్యారెట్ బంగారం ధరలు తగ్గాయి. నిన్న అనగా గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి.
ఆ ప్రకారంగా హైదరాబాదులో బంగారం ధరల విషయానికి వస్తే..22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.100 తగ్గింది. దాంతో బంగారం ధర రూ.46,350 నుంచి రూ.46,250 వరకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములపై రూ.110 తగ్గడంతో ధర రూ.50,560 నుంచి రూ.50,450 వరకు చేరుకుంది. కేవలం బంగారు ధరలు మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా బాగానే తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.61,500 గా ఉంది. అలాగే దేశీయ మార్కెట్ లో మాత్రమే కాకుండా మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్ లో కూడా బంగారం ధరలు తగ్గాయి. గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.49 శాతం అంటే రూ.246 తగ్గి రూ.49,897 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ రేట్ రూ.50,000 దిగువకు చేరింది.
అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం..ప్రస్తుతం ధరలు తగ్గుతున్నా వచ్చే ఏడాది ఇదే సమయానికి బంగారం ధర 10 శాతం కన్నా పైనే పెరుగుతుందని బులియన్ పరిశ్రమ సర్వేలో తేలింది. వచ్చేఏడాది మాత్రమే కాకుండా రానున్న రోజుల్లో ఈ బంగారం ధరలు మళ్ళీ ఆకాశాన్ని అంటబోతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలి అనుకున్న వారికి ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు.మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చూస్తే మరో రెండు రోజుల్లో ధంతేరాస్, వచ్చేవారం దీపావళి పండుగలు ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల కొనుగేళ్లు ఎక్కువగా ఉంటాయి. మరి రెండు రోజుల్లో బంగారం, వెండి ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అంతే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.