Site icon HashtagU Telugu

Tirumala: తిరుమలలో అంగరంగ వైభవంగా స్వర్ణ రథోత్సవం.!!

Festival Imresizer

Festival Imresizer

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వసంత్సోవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవంపై మాడ వీధుల్లో ఊరేగారు. ఈ దృశ్యాన్ని కనులార వీక్షించిన భక్తులు పులకించిపోయారు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్నారు.

అటు తిరుమలకు భక్తులు పోటెత్తారు గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు తిరుమలకు తరలివచ్చారు. కోవిడ్ ఆంక్షలు సడలించడంతోపాటు…వరసగా సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోతోంది. గుడ్ ఫ్రైడే, వీకెండ్ సెలవులు కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతోవైకుఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్స్ కూడా భక్తులతోనిండిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 17 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.