Site icon HashtagU Telugu

Gold Seized: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత..ఎంతంటే..!!

gold

gold

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దాదాపు ఒకటిన్నర కిలోలకు పైగా విదేశాల నుంచి తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు.

దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల లగేజీని తనిఖీ చేయగా…ఈ అక్రమ బంగారం గుట్టు బయటపడింది. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు..వారి నుంచి రూ. 89.74 లక్షల విలువ చేసే 1,680గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేశామని దర్యాప్తు చేపట్టినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

Cover Pic- Only For Representation