Gold Price Today : మనలో చాలామందికి వీలైనప్పుడల్లా బంగారు ఆభరణాలు కొనడం అలవాటు. శుభకార్యాల్లో ధరించేందుకు, అవసరమైతే నగదుగా మార్చుకునేందుకు అనువుగా ఉండటంతో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మీకు తెలిసిందా? ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. “మన సొమ్ము, మన ఇష్టం” అనిపించినా, బంగారం నిల్వకు సంబంధించి కొన్ని పరిమితులు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధంగా నిర్ణయించింది. ఆదాయ పన్ను (ఇంకం ట్యాక్స్) శాఖ నిబంధనల ప్రకారం, ఇంట్లో నిర్దిష్ట పరిమితికి మించిన బంగారం లేదా ఆభరణాలు ఉంచకూడదు. ఈ పరిమితులు అతిక్రమిస్తే అనవసరమైన సమస్యలు ఎదురుకావచ్చు. కాబట్టి, ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చో తెలుసుకోవడం, పన్ను నిబంధనలు పాటించడం చాలా అవసరం. మరి, ఆ నిబంధనలపై వివరాలు తెలుసుకుందాం! గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడంతో వినియోగదారులకు నిరాశ కలిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్, దేశీయంగా నగల వ్యాపారుల డిమాండ్ కారణంగా బులియన్ మార్కెట్‌లో మళ్లీ ఉత్సాహం నెలకొంది.
దేశ రాజధానిలో ధరల వివరాలు:
99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రోజున రూ. 290 పెరిగి రూ. 77,680కి చేరుకుంది. గత రెండు రోజుల్లో బంగారం ధర రెండు వేల రూపాయల వరకు తగ్గడం విశేషం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
హైదరాబాద్, విజయవాడ:
24 క్యారెట్లు: రూ. 77,520
22 క్యారెట్లు: రూ. 71,060
ఇతర ముఖ్య నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు):
చెన్నై: రూ. 77,520 (24 క్యారెట్లు), రూ. 71,060 (22 క్యారెట్లు)
వడోదర: రూ. 77,570 (24 క్యారెట్లు), రూ. 71,110 (22 క్యారెట్లు)
ముంబై, పూణే, కోల్‌కతా: రూ. 77,570 (24 క్యారెట్లు), రూ. 71,110 (22 క్యారెట్లు)
దిల్లీ: రూ. 77,680 (24 క్యారెట్లు), రూ. 71,210 (22 క్యారెట్లు)
వెండి ధరలు (కిలోకు):
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, భువనేశ్వర్: రూ. 98,100
ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, సూరత్: రూ. 90,100
(గమనిక: బంగారం, వెండి రేట్లు రోజుకు అనేక మార్లు మారుతుంటాయి. కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను చెక్ చేసుకోవడం అవసరం. ఇది మీకు ప్రస్తుత ధరల అవగాహన కోసం మాత్రమే.)
Buy Gold: తక్కువ ధరకే బంగారం లాంటి నగలు కొనాలా.. అయితే మీరు ఈ 3 మార్కెట్లకు వెళ్లాల్సిందే!