Today Gold Price: భారతీయులకు బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమైనవి, ముఖ్యంగా మహిళలు పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ సమయంలో డిమాండ్ పెరిగిపోతుంది. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది, అందుకే డిమాండ్ భారీగా పెరిగింది. అదే సమయంలో, ఇటీవల వరుసగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా పసిడి ధర పెరుగుతుంది.
శుక్రవారం నమోదైన వివరాల ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 870 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 800 పెరిగింది. ఐతే, గత ఐదు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 3,170 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధర పెరిగింది.
Wayanad Bypoll Results 2024 : అన్న రికార్డును చెల్లె బ్రేక్ చేస్తుందా..?
తెలుగు రాష్ట్రాల్లో ధరలు:
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,250కి చేరింది.
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,820 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు:
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,970.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,250 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,820.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,250 , 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,820.
వెండి ధరలు:
తెలుగు రాష్ట్రాల్లో, శుక్రవారం వెండి ధరలో ఎలాంటి మార్పులు లేవు.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ. 1,01,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నై, కోల్ కతా, ఢిల్లీ, ముంబయి, బెంగళూరులో కిలో వెండి ధరలు రూ. 92,000 నుంచి రూ. 1,01,000 మధ్య ఉన్నాయి.
ఈ ధరలు ఉదయం నమోదు చేసినవి, , ప్రాంతాల వారీగా ధరలు మారవచ్చు. కనుక, బంగారం కొనుగోలు చేసేటప్పుడు ఆ సమయానికి ధరను జాగ్రత్తగా ట్రాక్ చేయడం మంచిది.