Gold Seizures: రికార్డు స్థాయిలో గోల్డ్ స్వాధీనం.. 1450 కిలోలకు పైగా బంగారం పట్టుకున్న డీఆర్‌ఐ..!

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో బంగారాన్ని స్వాధీనం (Gold Seizures) చేసుకుంది.

Published By: HashtagU Telugu Desk
Gold- Silver Return

Gold- Silver Return

Gold Seizures: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) గత ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో బంగారాన్ని స్వాధీనం (Gold Seizures) చేసుకుంది. సోమవారం 66వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. సమాచారం ఇస్తూ.. DRI ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ మోహన్ కుమార్ సింగ్.. స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022-23 గణాంకాలను ఉటంకిస్తూ భారతదేశంలో బంగారం స్మగ్లింగ్ ఇప్పటికీ ఆందోళన కలిగించే విషయమని అన్నారు.

దేశవ్యాప్తంగా 275 కేసుల్లో 1450 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీఆర్‌ఐ తెలిపింది. గతేడాది సీజ్ చేసిన పరిమాణం కంటే ఈ పరిమాణం రెట్టింపు. 2020-21 సంవత్సరంలో DRI 833 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే డ్రగ్స్ తగ్గుముఖం పట్టిందని మోహన్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 522 అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో మొత్తం రూ.11,500 కోట్ల స్మగ్లింగ్ స్వాధీనం చేసుకుమన్నారు.

Also Read: Congress MLAs: మంత్రి పదవీ ప్లీజ్.. క్యాబినెట్ పోస్టులపై టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాబీయింగ్!

వీటిలో 1,300 కిలోల హెరాయిన్, 150 కిలోల కొకైన్, 250 కిలోల మెథాంఫెటమైన్, 25 మెట్రిక్ టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డిఆర్ఐ ఈ సంవత్సరం గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ నుండి 3,463 కిలోల హెరాయిన్, 26,946 మెట్రిక్ టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకుంది. అన్ని పరిశోధనలు పూర్తి చేసేందుకు ప్రచారం ప్రారంభించామని, ఇప్పటి వరకు 944 కేసుల దర్యాప్తును పూర్తి చేశామని డీఆర్‌ఐ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

  Last Updated: 05 Dec 2023, 12:28 PM IST