Site icon HashtagU Telugu

Vijayawada : విజ‌య‌వాడ‌లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్న క‌స్ట‌మ్స్ అధికారులు

Gold Rates

Man Swallows 7 Gold Biscuits

దుబాయ్, శ్రీలంక దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని విజయవాడలోని కస్టమ్స్ అధికారులు ప‌ట్టుకున్నారు. శుక్రవారం చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న కారును బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో క‌స్ట‌మ్స్ అధికారులు అడ్డుకుని 4.3 కిలోల బంగారాన్ని ఓ వ్యక్తి తీసుకెళ్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్మ‌గ‌ర్లు బంగారంపై ఉన్న విదేశీ గుర్తులను ఉద్దేశపూర్వకంగా తొలగించినట్లు తెలుస్తోంది. రూ. 1.5 లక్షల విలువైన విదేశీ కరెన్సీ (కువైట్ దినార్, ఖతార్ రియాల్ మరియు ఒమన్ రియాల్ మొదలైనవి)తో పాటు 6.8 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారం మొత్తం బరువు 11.1 కిలోలుగా ఉంది. దీని మొత్తం విలువ రూ.6.40 కోట్లుగా అధికారులు అంచ‌నా వేశారు. కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం నిందితుడిని అరెస్టు చేశారు.