Hyderabad : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్‌

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) బృందం

  • Written By:
  • Updated On - March 6, 2023 / 03:52 PM IST

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) బృందం భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముగ్గురు వ్యక్తులను పట్టుకుని 600 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ముగ్గురు వ్యక్తులను ఎం అష్ఫాక్ అహ్మద్, 37, మహ్మద్ షేక్ అబ్దుల్లా, 31, మరియు నైనా మహమ్మద్, 49 గా గుర్తించారు. ముగ్గురు నిందితులను ప్రొఫైలింగ్ మరియు ప్రవర్తన గుర్తింపు ఆధారంగా అరెస్టు చేశారు. వారు దుబాయ్ నుండి ఇండిగోలో.. తరువాత ఎయిర్ ఇండియా విమానంలో వచ్చారని అధికారులు తెలిపారు. విచారణలో వారి వాట్సాప్ చాట్‌లు మరియు వాయిస్ సందేశాలు తనిఖీ చేశామ‌ని.. తాము వారి బ్యాగులను కూడా తనిఖీ చేసిన‌ట్లు సిఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. అందులో 596 గ్రాముల బంగారం రూ. 33,73,360/- లభ్యమైందని.. దానిని స్వాధీనం చేసుకుని బంగారంతో పాటు ముగ్గురు నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించామ‌ని తెలిపారు.