Gold Seized : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.15ల‌క్ష‌ల విలువైన బంగారం స్వాధీనం

హైదరాబాద్ విమానాశ్రయంలో రూ.15 లక్షల విలువైన బంగారాన్ని క‌స్ట‌మ్స్ అదికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ

Published By: HashtagU Telugu Desk
48 Kg Gold Paste

48 Kg Gold Paste

హైదరాబాద్ విమానాశ్రయంలో రూ.15 లక్షల విలువైన బంగారాన్ని క‌స్ట‌మ్స్ అదికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడిని పట్టుకుని 246 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.15ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. షార్జా నుంచి ఇండిగో విమానంలో ప్రయాణికుడు వచ్చాడని క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు. బ్యాగుల జిప్ హోల్డర్లలో బంగారంను దాచి తీసుకువ‌స్తుండ‌గా.. అనుమానం వ‌చ్చిన క‌స్ట‌మ్స్ అధికారులు ప్ర‌యాణికుడిని త‌నిఖీ చేశారు. తనిఖీల్లో బంగారం దొరికింది. బంగారాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని కస్టమ్స్ అధికారులు తెలిపారు.

  Last Updated: 14 Aug 2023, 07:46 PM IST