Gold Seized : హైదరాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 08:07 AM IST

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. 1,633 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మూడు వేర్వేరు కేసులకు సంబంధించి ఆదివారం అరెస్టు చేసినట్లు అధికారులు ప్రకటించారు. బంగారం మొత్తం విలువ రూ.99.57 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు . ప్రొఫైలింగ్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ కస్టమ్స్ అధికారి తెలిపారు. నిందితులు శనివారం రస్ అల్-ఖైమా నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారు తమ లగేజీలో బంగారాన్ని దాచారని క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు. “కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 నిబంధనల ప్రకారం రికవరీ చేసిన బంగారాన్నిఅధికారులు జప్తు చేశారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 104 కింద ప్రయాణికులను అరెస్టు చేశామ‌ని అని అధికారులు తెల‌పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.