హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి మస్కట్ మీదుగా వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. అనుమానం వచ్చిన అధికారులు ప్రయాణికుడి సామాను సోదా చేయగా ట్రాలీ బ్యాగ్ హ్యాండిల్‌లో 224 గ్రాముల రెండు బంగారు కడ్డీలు దాచి ఉంచారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ. 13.72 లక్షల రూపాయలుగా గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad : శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు

Gold- Silver Return