Site icon HashtagU Telugu

Gold Seized : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.1.20 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

Hyderabad Airport Rgia

Hyderabad Airport Rgia

హైదరాబాద్: దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు రూ.1.20 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లోని హైదరాబాద్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ గురువారం దుబాయ్ నుండి EK-526లో వచ్చిన ప్రయాణికుడిని త‌నిఖీ చేశారు. సూట్‌కేసు రాడ్‌లో దాచిపెట్టి రూ.1.20 కోట్ల విలువైన 2,290 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.