Gold Price Today : భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారతీయ మహిళలు బంగారు ఆభరణాల కొనుగోలులో ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో బంగారం కొనుగోలు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో బంగారం ధరలు సాధారణంగా పెరుగుతాయి.
ఇటీవల అంతర్జాతీయంగా , దేశీయంగా బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలను చేరుకున్నాయి. అయితే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటుందన్న అంచనాలు వస్తున్న నేపథ్యంలో ధరలు కొంత తగ్గాయి. కానీ అంచనాలను మించి వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించడం, ధరలను మళ్లీ పెరిగేలా చేసింది. అయితే, బంగారం రేట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలకు మాత్రం చేరుకోలేదు.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2624 డాలర్ల వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ధర 29.41 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరింత పతనమవుతోంది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ రూ. 85.458గా ఉంది.
Game Changer Story: గేమ్ ఛేంజర్ స్టోరీ ఇదే.. డైరెక్టర్ శంకర్!
దేశీయ బంగారం ధరలు
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం తులానికి రూ. 71,350గా ఉంది. గడచిన రోజుల్లో ఇది రూ. 150 తగ్గగా, దానికి ముందు వరుసగా రూ. 100, రూ. 250 పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 77,840 వద్ద ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 71,500గా ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 77,990 వద్ద ఉంది.
వెండి ధరలు
వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 92,400గా ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 99,900 వద్ద ఉంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాల ప్రకారం మారుతుంటాయి. అందుకే హైదరాబాద్‌లో బంగారం ధర ఢిల్లీలో కంటే తక్కువగా ఉండగా, వెండి ధర ఢిల్లీలో తక్కువగా ఉంది.
గమనిక: బంగారం, వెండి రేట్లు రోజువారీ మార్పులకు లోనవుతాయి. కొనుగోలు ముందు తాజా రేట్లను పరిశీలించడం మంచిది.
Mann Ki Baat: నాగేశ్వర రావు గురించి మాట్లాడిన మోడీ.. థ్యాంక్స్ చెప్పిన నాగార్జున