Site icon HashtagU Telugu

Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..!

Gold And Silver Rate

Gold And Silver Rate

Gold Price Today: భారతీయులు, ముఖ్యంగా మహిళలు, బంగారం ఆభరణాలను ధరించడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే, కొద్ది నెలలుగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరగడంతో కొనుగోలు దారులు వెనకడుగు వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తులం బదులు అర తులం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అయితే, గత మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గడం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించింది.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో క్రితం రోజున ఔన్సు గోల్డ్ ధర 10 గ్రాముల మేర తగ్గింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ రేటు 2617 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 29.12 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. రూపాయి విలువ కూడా రూ.85.200 వద్ద కొనసాగుతోంది.

Pushpa 2 The Rule : ‘‘పుష్ప 2 ది రూల్’’.. రూ.700 కోట్ల క్లబ్‌లోకి హిందీ వర్షన్.. ఈ లిస్టులోని ఇతర చిత్రాలివీ

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం రేటు 10 గ్రాములకు రూ.100 తగ్గి, ప్రస్తుతం రూ.70,900 వద్దకు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు కూడా రూ.100 తగ్గడంతో, ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.77,350గా ఉంది.

వెండి ధరలు స్థిరంగా
వెండి ధరలు కూడా గత రోజు స్వల్పంగా తగ్గిన తర్వాత, ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.98,900 వద్ద కొనసాగుతోంది.

గమనిక : ఈ రేట్లు డిసెంబర్ 25వ తేదీ ఉదయం 7 గంటలకు నమోదైనవే. మధ్యాహ్నం లేదా ఆ తరువాత మార్పులు సంభవించే అవకాశం ఉంది. వీటిలో జీఎస్టీ, ఇతర పన్నులు కలపడం లేదు. బంగారం లేదా వెండి కొనుగోలు చేసే ముందు తాజా రేట్లు తెలుసుకోవడం మంచిది.

Sandhya Theater Incident : అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన దిల్ రాజు