Gold Prices: నేడు బంగారం, వెండి కొనేవారికి మంచి ఛాన్స్.. 22 క్యారెట్ల తులం ధర ఎంతంటే..?

కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Prices) నేడు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.55,450గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గా నమోదైంది.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 06:53 AM IST

Gold Prices: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Prices) నేడు తగ్గుముఖం పట్టాయి. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.55,450గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,490గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.76,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

బంగారం, వెండి ధ‌రలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (మే 31, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!

Also Read: Dhoni Autograph: ధోని ఆటోగ్రాఫ్ కోసం చాహర్ చిన్నపిల్లాడి చేష్టలు

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,600 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,630గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,920గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,490 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,490గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,530గా ఉంది.

వెండి ధరలు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,600 ఉండగా, ముంబైలో రూ.72,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, కోల్‌కతాలో రూ.76,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, కేరళలో రూ.76,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, విజయవాడలో రూ.76,500 వద్ద కొనసాగుతోంది. విశాఖ‌ప‌ట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.