Gold Price Today : మళ్లీ పెరిగిన బంగారం ధరలు..!

Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి కొత్త సంవత్సరంలో షాక్ తగులుతోంది. వరుసగా గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా, అంతర్జాతీయంగా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే ముఖ్యంగా పసిడి ధరలు భారీగా ఎగబాకాయి. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

Published By: HashtagU Telugu Desk
Gold Prices

Gold Prices

Gold Price Today : కొత్త ఏడాది మొదలైనప్పటి నుండి బంగారం ధరలు ముందుగా కొంచెం తగ్గినా, ఇప్పుడు వరుసగా రెండో రోజు పెరుగుతూ కొనుగోలు దారులకు షాక్ ఇస్తున్నాయి. భారతీయులు బంగారంపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకల సమయంలో గోల్డ్ జువెల్లరీ కొనుగోలు చేయడానికి అధికంగా మొగ్గు చూపుతారు. ఈ కారణంగా బంగారం డిమాండ్ ఎప్పుడూ ఉన్నట్టే ఉంటుంది. గతేడాది అక్టోబర్-నవంబర్ సమయంలో గోల్డ్ రేట్లు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికవడం, డాలర్, బాండ్ ఈల్డ్స్ పుంజుకోవడం వంటివి గోల్డ్ రేట్ల తగ్గుదలకు దోహదం చేశాయి. కానీ ఇప్పుడు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య, కొత్త ఏడాదిలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

హైదరాబాద్ గోల్డ్ రేట్లు:
ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 71,800 గా ఉంది, ఇది ఒకే రోజు రూ. 300 పెరిగింది. గత రెండు రోజుల వ్యవధిలో మొత్తంగా రూ. 700 పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 330 పెరిగి 10 గ్రాములకు రూ. 78,330 కు చేరుకుంది.

ఢిల్లీ గోల్డ్ రేట్లు:
హైదరాబాద్‌కు తోడు, ఢిల్లీలోనూ బంగారం ధరలు పెరిగాయి. అక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 71,950 పలుకుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,480 గా ఉంది.

వెండి ధరలు స్థిరంగా:
వెండి ధరల్లో పెరుగుదల పెద్దగా కనిపించట్లేదు. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 90,500 వద్ద ఉండగా, హైదరాబాద్‌లో ఇది రూ. 98,000 గా ఉంది. గోల్డ్, సిల్వర్ రేట్లు ప్రాంతానుసారం పన్నులు, ఇతర కారణాలతో మారుతూ ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం:
ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం ధరలు కూడా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2660 డాలర్లకు చేరగా, స్పాట్ సిల్వర్ రేటు 29.60 డాలర్ల వద్ద నిలిచింది. ఇదే సమయంలో, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.83 గా ట్రేడవుతోంది. ఈ ధరల పెరుగుదల కొనుగోలు దారులను ప్రభావితం చేస్తుండగా, మార్కెట్‌లో చలనాలపై అందరి దృష్టి ఉంది.

 
Nara Lokesh : కోటిమంది టీడీపీ కార్యకర్తలకు ప్రమాద బీమా.. నారా లోకేశ్ చారిత్రాత్మక నిర్ణయం
 

  Last Updated: 03 Jan 2025, 10:29 AM IST